Home South Zone Andhra Pradesh చీరాలలో పోలీసుల ‘కార్డన్ సెర్చ్’.. 27 వాహనాలు సీజ్!

చీరాలలో పోలీసుల ‘కార్డన్ సెర్చ్’.. 27 వాహనాలు సీజ్!

0

బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాను మేరకు చీరాల డిఎస్పి ఎండి మోయిన్ సూచనలతో చీరాల పట్టణ ఉజిలి పేటలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన చీరాల సబ్ డివిషనల్ పోలీసులు.
ఈ సందర్భంగా చీరాల ఒకటో పట్టణ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ నేడు జరిపిన కార్డెన్ సెర్చ్ లో 150 గృహాలు తనికి చేశామని,ఈ తనికిలో భాగంగా సరైన పత్రాలు లేని 27 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అందులో 25 బైకులు, రెండు కార్లు, ఒక ఆటో ఉన్నాయని తెలిపారు.

అనుమానాస్పదంగా ఉన్న గృహాలను తనకి చేయగా ఎక్కడ గంజాయి కానీ మాదగ ద్రవ్యాలు గాని దొరకలేదని తెలియజేశారు.ఈ తనికిలో రెండవ పట్టణ సీఐ నాగభూషణం, ఇంకోలు సీఐ రమణయ్య,పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్ పట్టణ మహిళా ఎస్సై రాజ్యలక్ష్మి, పట్టణ ఎస్సై వెంకటేశ్వర్ల రెడ్డి,రెండవ పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు,చిన్నగంజాం ఎస్ఐ రమేష్,శక్తి టీం సుబ్బారావు,ఈగల్ టీం సురేష్, 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version