Home South Zone Andhra Pradesh మదనపల్లెలో స్థలం కోసం ఇరువర్గాల ఘర్షణ.. 12 మందిపై కేసు.

మదనపల్లెలో స్థలం కోసం ఇరువర్గాల ఘర్షణ.. 12 మందిపై కేసు.

0

మదనపల్లె అమ్మచెరువుమిట్టలో ఇంటి స్థలం వివాదం రమణమ్మ, నారాయణమ్మ కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. రమణమ్మ ఇల్లు నిర్మిస్తుండగా, అది తమ స్థలమని నారాయణమ్మ కుటుంబీకులు అడ్డుకోవడంతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.

ఈ ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్లీశ్వరితో సహా 12 మందిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్సై రహీముల్లా శుక్రవారం తెలిపారు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

NO COMMENTS

Exit mobile version