Home South Zone Andhra Pradesh రక్షణే లక్ష్యం: హెల్ప్‌లైన్ నంబర్లపై విద్యార్థినులకు డీఎస్పీ అవగాహన.

రక్షణే లక్ష్యం: హెల్ప్‌లైన్ నంబర్లపై విద్యార్థినులకు డీఎస్పీ అవగాహన.

0

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ‘ఓపెన్ హౌస్’ నిర్వహించారు.

సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది విద్యార్థినులకు పోలీసుల పనితీరు, ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించారు. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ పరిశోధనలు, డ్రోన్ల సాంకేతికతను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. మహిళల భద్రత కోసం 112, 181, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్ల ప్రాముఖ్యతను వివరించారు.

ఫిబ్రవరి 28 నుండి మార్చి 8 వరకు జిల్లావ్యాప్తంగా మహిళా సాధికారత ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version