అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మదనపల్లి కోటవీధికి చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మణరావు, శనివారం తన ఆటోలో ఇంటి సామాగ్రిని ముదివేడుకు తరలిస్తుండగా, కురబలకోట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు.
విధుల నిర్వహణలోనే ఆయన మరణించడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి పరిశీలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు నిర్ధారించారు.
