ఖమ్మం జిల్లాలో 10 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. 317జీవో ప్రకారం ఇంటర్ లోకల్ కేడర్లో భాగంగా వీరిని మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి ఇతర జిల్లాలకు కేటాయించారు.
నేలకొండపల్లి, పెనుబల్లి, తిరుమలాయపాలెం తదితర మండలాలకు చెందిన కార్యదర్శులు ఈ బదిలీ అయిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరంతా తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది.
