Home South Zone Telangana మాదిగలకు అండగా ప్రభుత్వం: ఆత్మగౌరవ భవనానికి నిధుల మంజూరు!

మాదిగలకు అండగా ప్రభుత్వం: ఆత్మగౌరవ భవనానికి నిధుల మంజూరు!

0

హైదరాబాద్ శిల్పకళా వేదికలో మాదిగ ఉద్యోగుల కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందన సభ జరిగింది. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపినందుకు సిఎంను ఉద్యోగ సంఘాలు ఘనంగా సన్మానించాయి.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని, ఒక్కరోజు నిర్లక్ష్యం పది దళిత కుటుంబాలకు అన్యాయం చేస్తుందని హెచ్చరించారు.

మాదిగల ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని, వర్గీకరణ ద్వారా దళితుల హక్కులను కాపాడతామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లని, పేదల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version