హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వంటల పోటీ ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ సీజన్-10లో తెలంగాణకు చెందిన తల్లి, కూతుళ్ల జోడీ అద్భుత ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన రాచకొండ సాయిశ్రీ మరియు ఆమె తల్లి చందన ఈ పోటీలో రన్నరప్‌లుగా నిలిచి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని చాటారు.
మాస్టర్‌చెఫ్ ఇండియా చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘జోడీ ఫార్మాట్’లో వీరిద్దరూ పాల్గొని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.
వేలాది మంది పోటీ పడిన ఈ సీజన్లో సాయి శ్రీ, చందన తమ వంటల నైపుణ్యంతో అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్–12 మరియు టాప్–5 దశలను విజయవంతంగా దాటారు.
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ పోరులో, ఈ తల్లి–కూతుళ్ల జోడీ తమదైన శైలిలో వంటలను రుచి చూపించి టాప్–2లో స్థానం సంపాదించుకున్నారు.
త్రుటిలో టైటిల్‌ను చేజార్చుకున్నప్పటికీ, దేశంలోనే అతిపెద్ద కుకరీ షోలో రన్నరప్‌లుగా నిలవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక చిన్న జిల్లా నుంచి వచ్చి జాతీయ వేదికపై తెలంగాణ రుచులను, తమ ప్రతిభను చాటిన సాయిశ్రీ మరియు చందనలను పలువురు ప్రముఖులు అభినందించారు.
వీరి విజయం ఎంతో మంది ఔత్సాహిక వంట నిపుణులకు స్ఫూర్తిదాయకమని వారన్నారు
#sidhumaroji
Alwal
