మదనపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన గాయత్రి అనే గర్భిణీ మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. వాల్మీకిపురానికి చెందిన గాయత్రి, ప్రసవ నొప్పులతో ఆసుపత్రికి రాగా, చికిత్స పొందుతూ మరణించింది.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
