వంట గ్యాస్‌పై ₹60, వాణిజ్య సిలిండర్‌పై ₹115 పెంచడాన్ని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు శనివారం మదనపల్లిలో తీవ్రంగా ఖండించారు.
అంతర్జాతీయ రాజకీయ కారణాలతో సామాన్యులపై భారం మోపడం అన్యాయమని, ఇది నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పెంచిన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ, జనసేనలను కోరారు. ఈ పెంపునకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
