Home South Zone Andhra Pradesh ​లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్.

​లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్.

0

అన్నమయ్య జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లెలో నిర్వహించిన సమీక్షలో, అక్రమ అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలపై పోలీస్, వైద్య శాఖలు సమన్వయంతో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు.

ప్రసూతి మరణాలు నివారించడానికి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గర్భవతులకు అవగాహన కల్పించాలని, పాఠశాలల్లోనూ ఈ చట్టంపై అవగాహన పెంచాలని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version