Home South Zone Andhra Pradesh కరప: గురుకుల పాఠశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులు

కరప: గురుకుల పాఠశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులు

0

కరపలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు.

ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 4 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 12న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను పరీక్షకు వారం రోజుల ముందు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.

NO COMMENTS

Exit mobile version