Home South Zone Telangana ఐపీఎల్ తొలి షెడ్యూల్ విడుదల… మార్చి 28న హైదరాబాద్ మ్యాచ్.|

ఐపీఎల్ తొలి షెడ్యూల్ విడుదల… మార్చి 28న హైదరాబాద్ మ్యాచ్.|

0

హైదరాబాద్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి Board of Control for Cricket in India (BCCI) ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో Royal Challengers Bengaluru మరియు Sunrisers hyderabad జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం లో జరుగుతుంది.
ఐపీఎల్ 19వ సీజన్‌గా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో తొలి దశ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు.
ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం మొదటి దశలో జరిగే మ్యాచ్‌లు మార్చి 28 నుంచి ప్రారంభమై ఏప్రిల్ మధ్య వరకు కొనసాగనున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న పలు స్టేడియాల్లో నిర్వహించనున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆర్సీబీ తన హోం గ్రౌండ్‌లోనే సీజన్‌ను ప్రారంభించడం విశేషం. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుతో పోటీ ఉండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
తొలి కొన్ని మ్యాచ్‌లు (తొలి దశ).
మార్చి 28: RCB vs SRH – బెంగళూరు.
మార్చి 29: Mumbai Indians vs Kolkata Knight Riders – ముంబై.
మార్చి 29: Rajasthan Royals vs Chennai Super Kings – గువాహటి.
మార్చి 31: Punjab Kings vs Gujarat Titans – ముల్లాన్‌పూర్.
#sidhumaroji
Alwal

NO COMMENTS

Exit mobile version