Home South Zone Andhra Pradesh తిరుమలకు వెళుతున్న కారులో అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం.

తిరుమలకు వెళుతున్న కారులో అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం.

0

తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా నగదు పట్టుబడటం చర్చనీయాంశమైంది. మంగళవారం ఉదయం విజిలెన్స్ సిబ్బంది జరిపిన సాధారణ తనిఖీల్లో ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

నాణేల మార్పిడి కోసమే ఈ నగదును తీసుకెళ్తున్నానని సదరు వ్యక్తి చెప్పినప్పటికీ, తగిన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదు ఎక్కడి నుండి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తిరుమల కొండపైకి అనుమతి లేకుండా ఇంత భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version