Home South Zone Andhra Pradesh పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు

పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు

0

రాజమండ్రి శ్రీ హర్షిత గ్యాస్ట్రో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఉమాకాంత్ పిల్లల పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఆరో నెల నుండే పిల్లలకు మెత్తగా ఉడికించిన ఆహారం అలవాటు చేయాలని ఆయన సూచించారు.

ఎనిమిది నెలల వయసు నుంచి పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చాలని తెలిపారు. పిల్లలకు బలవంతంగా తినిపిస్తే వాంతులు వంటి సమస్యలు వస్తాయని హెచ్చరించారు. పిల్లల ఎత్తు అనేది పోషకాహారంతో పాటు వంశపారంపర్యంగా కూడా వస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీర్ణక్రియే పిల్లల ఎదుగుదలకు పునాది అని, సమతుల్య ఆహారం తప్పనిసరి అని ఆయన వివరించారు.

NO COMMENTS

Exit mobile version