Home South Zone Andhra Pradesh మంత్రి సంకల్పం -హరిత నెల్లూరు వైపు అడుగులు – టిడిపి నాయకులు

మంత్రి సంకల్పం -హరిత నెల్లూరు వైపు అడుగులు – టిడిపి నాయకులు

0

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నెల్లూరు నగరాన్ని హరితవనంగా మార్చేందుకు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించారు. నగరంలోని 28 డివిజన్లలో 50 వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పోటీపడి మొక్కలు నాటుతున్నారు.

15వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ, ప్రతి ఐదు మీటర్లకు ఒక చెట్టు ఉండేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ మరియు ఇతర స్థానిక నేతలు పాల్గొని పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు.

NO COMMENTS

Exit mobile version