Home South Zone Andhra Pradesh సమయపాలన తప్పనిసరిగా పాటించాలి.. .. ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్. షాను.

సమయపాలన తప్పనిసరిగా పాటించాలి.. .. ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్. షాను.

0

అంగన్వాడి కేంద్రాల నిర్వహణలో సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ షేక్. షాను తెలిపారు. ఆమె మంగళవారం గంగవరం, సోంపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్ర ప్రాంగణాలను శుభ్రపరచడం,పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, సురక్షితమైన తాగునీరు, పోషకాహార కౌన్సిలింగ్ తదితర వాటిపై పై అవగాహన కల్పించారు. అనంతరం పలు రకాల రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎలీసమ్మ, సారా లు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version