Home South Zone Andhra Pradesh సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే దుకాణాలు సీజ్: డాక్టర్ దినేష్ హెచ్చరిక.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే దుకాణాలు సీజ్: డాక్టర్ దినేష్ హెచ్చరిక.

0

నెల్లూరు నగరంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులపై నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. స్టోన్ హౌస్ పేటలోని గోదాముల్లో నిల్వ ఉంచిన 800 కేజీల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సీజ్ చేసి, నిర్వాహకులకు రూ. 3.20 లక్షల జరిమానా విధించారు.

120 మైక్రోన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు అని, నిబంధనలు అతిక్రమిస్తే దుకాణాలను శాశ్వతంగా మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, నిషేధిత ప్లాస్టిక్ నిల్వలపై సమాచారం అందించాలని ఈ సందర్భంగా డాక్టర్ కోరారు.

NO COMMENTS

Exit mobile version