తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 2026 హైదరాబాద్‌లోని సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న సూర్యోదయ హెల్పింగ్ హాండ్స్ సంస్థకు గోల్డెన్ నంది అవార్డు – 2026ను ప్రదానం చేశారు.
సంస్థ తరఫున నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు, పేదలకు అన్నదానం, వృద్ధాశ్రమాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం, తలసేమియా బాధిత పిల్లలకు రక్తం అందించడంలో చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు.
ఈ అవార్డును తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మరియు తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కమిషన్ కమిషనర్ సరిత గోగుల చేతుల మీదుగా సంస్థ కన్వీనర్ తమరాన రామకృష్ణ (LIC) మరియు సంస్థ సెక్రటరీ రొంగల అర్జున్ స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ సూర్యోదయ హెల్పింగ్ హాండ్స్ సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఇలాగే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
ఈ అవార్డు లభించిన సందర్భంగా పలువురు ప్రముఖులు మరియు సేవాభావులు సూర్యోదయ హెల్పింగ్ హాండ్స్ సంస్థకు అభినందనలు తెలిపారు.
