Home South Zone Andhra Pradesh పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా

పెద్దాపురం పురపాలికకు స్పెషల్ గ్రేడ్ హోదా

0

చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పెద్దాపురం పురపాలికకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేస్తూ మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ నిర్ణయంతో పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
జనవరి నెలలో పురపాలిక అధికారులు కౌన్సిల్ తీర్మానం ద్వారా స్పెషల్ గ్రేడ్ హోదా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం వాటిని పరిశీలించి ఆమోదం తెలిపింది.

1915లో స్థాపించబడిన పెద్దాపురం పురపాలిక 2009లో ద్వితీయ శ్రేణి స్థాయికి చేరింది. ప్రస్తుతం పట్టణ జనాభా 57,779గా ఉండగా, పురపాలిక వార్షిక ఆదాయం సుమారు రూ.26.28 కోట్లుగా ఉంది.
స్పెషల్ గ్రేడ్ హోదా లభించడం వల్ల పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ వంటి రంగాలకు మరింత నిధులు లభించే అవకాశాలు ఉన్నాయని పురపాలిక కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

NO COMMENTS

Exit mobile version