తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి బంగారు, వెండి డాలర్లను ఇకపై ఆన్లైన్లో విక్రయించి, పోస్టల్ ద్వారా భక్తుల ఇళ్లకు పంపనుంది. టీటీడీ ఫైనాన్స్ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు పాలకమండలి ఆమోదం తెలపడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది.
బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో, సామాన్యులకు అందుబాటులో ఉండేలా బంగారు పూత పూసిన వెండి డాలర్లను కూడా కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. డాలర్ల రవాణాలో భద్రత కోసం బీమా సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఈ నిర్ణయం వల్ల తిరుమల రాలేని కోట్లాది మంది భక్తులకు స్వామివారి డాలర్లు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
