Home South Zone Andhra Pradesh అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక.

అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక.

0

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు.
జిల్లాలో గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని, తప్పుడు వార్తలను సృష్టించినా లేదా ఫార్వార్డ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వారిపై నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

NO COMMENTS

Exit mobile version