బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద గడ్డివాముతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రాణనష్టం తప్పినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ల పట్ల స్థానికులు మండిపడుతున్నారు.
సైడ్ డోర్లు లేకుండా, విద్యుత్ తీగలకు తగిలేలా మితిమీరిన ఎత్తుతో లోడ్ చేయడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
