Home South Zone Andhra Pradesh ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

0

మొల్ల‌మాంబ జీవితం అందరికీ ఆద‌ర్శ‌నీయం..
– *ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*
తొలి తెలుగు క‌వ‌యిత్రి మొల్లమాంబ జీవితం అంద‌రికీ ఆదర్శ‌నీయ‌మ‌ని.. అపారమైన జ్ఞానంతో రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ర‌చించి, సామాన్యులకు కూడా సాహిత్య రుచిని చూపించార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య సమావేశ‌మందిరంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. అధికారుల‌తో క‌లిసి మొల్ల‌మాంబ చిత్రపటానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మొల్ల‌మాంబ సాహిత్య సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. మొల్ల రామాయణం నేటికీ అత్యంత ప్రాచుర్యం పొందిన, తేట తెలుగు కావ్యాలలో ఒకటిగా నిలిచిపోయిందని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, బీసీ సంక్షేమం, వివిధ శాఖ‌ల అధికారులు, క‌లెక్ట‌రేట్ అధికారులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version