Home South Zone Andhra Pradesh జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లెలో ప్రత్యేక పూజలు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లెలో ప్రత్యేక పూజలు.

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మదనపల్లెలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ ఆధ్వర్యంలో లాభాల గంగమ్మ గుడిలో ఈ పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

NO COMMENTS

Exit mobile version