ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జేఎస్‌డబ్ల్యూ సంస్థకు 424 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపారు.
గిరిజన రైతులకు డ్రిప్ ఇరిగేషన్‌పై 100% సబ్సిడీ, మహిళా ఉద్యోగినుల కోసం 30 ‘సఖీ నివాస్’ హాస్టళ్లు, మరియు మూడు కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, జల జీవన్ మిషన్ కింద రూ.9,355 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు, పోలవరం పనుల వేగవంతానికి అదనపు నిధుల కేటాయింపు వంటి ప్రజాహిత నిర్ణయాలు తీసుకున్నారు.
