Home South Zone Andhra Pradesh ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు

ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు

0

ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ‘ప్రజా దర్బార్’ నిదర్శనమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి 50 అర్జీలను స్వీకరించారు.

ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మరియు రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం (PGRS) ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసి, నెల రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు.

NO COMMENTS

Exit mobile version