Home South Zone Andhra Pradesh అన్నమయ్య జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.

అన్నమయ్య జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.

0

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా, హెల్మెట్ ధరించనివారు, సీట్ బెల్ట్ వాడనివారు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ప్రధాన కూడళ్లలో గంజాయి, మద్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచడంతో పాటు, పట్టణాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించి, ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.

NO COMMENTS

Exit mobile version