మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ, శ్రీరాముని చరిత్రను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సరళమైన తెలుగులో రచించిన గొప్ప కవయిత్రి మొల్ల అని కొనియాడారు. తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. ఇంచార్జ్ బీసీ సంక్షేమ అధికారి తేజస్విని మాట్లాడుతూ, మొల్ల కేవలం ఐదు రోజుల్లోనే 871 పద్యాలతో కూడిన రామాయణాన్ని రచించారని గుర్తుచేశారు.
