Home South Zone Andhra Pradesh ప్రతి ప్రాణమూ విలువైందే.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

ప్రతి ప్రాణమూ విలువైందే.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

0

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.44 కోట్లు విడుదల చేస్తూ, ప్రమాదకరమైన ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళలపై నేరాలు, గంజాయి, డ్రగ్స్ మరియు రౌడీయిజంపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబించాలని స్పష్టం చేశారు.

ముఖ్యంగా బాణసంచా తయారీ కేంద్రాల్లో 15 రోజుల్లోగా తనిఖీలు పూర్తి చేయాలని గడువు విధించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ఏమాత్రం అలసత్వం వహించినా సహించబోమని, నిబంధనల అమలులో కఠినంగా ఉండాలని అధికారులను సీఎం హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version