Home South Zone Andhra Pradesh పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్

0

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్
పెద్దారవీడు మండలం
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న సుమారు 30 మంది బాలబాలికలకు జనసేన నాయకులు దూదేకుల కాసిం, తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపాటి ఈశ్వర్లు పరీక్ష మెటీరియల్ ప్యాడ్ పెన్నులు పెన్సిల్స్ మరియు జామెంట్రీ బాక్స్ లను అందించారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అదేవిధంగా పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులై 570 మార్కులు సాధించిన విద్యార్థులకు లాప్టాప్ ను బహుమతిగా అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో పేద విద్యార్థుల కోసం పదవ తరగతి పరీక్షల దృష్ట్యా అవసరమైన మెటీరియల్ అందించినందుకు ప్రధానోపాధ్యాయులు కాసిం,గ్రామ పెద్ద బత్తుల కాశయ్య మరియు పాఠశాల సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలిపారు.

NO COMMENTS

Exit mobile version