గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి అక్కారం పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేయాలని నిరసన తెలుపగా, స్పందించిన అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు.
ఈ మేరకు ఆ ప్రాంత రైతులు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
