Home South Zone Andhra Pradesh మదనపల్లెలో రూ. 5 కోట్ల ఆలయ భూమి కబ్జా.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు.

మదనపల్లెలో రూ. 5 కోట్ల ఆలయ భూమి కబ్జా.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు.

0

మదనపల్లె పట్టణంలోని మడికయల శివాలయానికి చెందిన సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 41 సెంట్ల భూమిని కొందరు వ్యక్తులు రెడ్డి సంఘం పేరుతో అక్రమంగా కబ్జా చేశారని ఆలయ కమిటీ సభ్యులు సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ (PGRS) లో ఫిర్యాదు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.

దీనిపై స్పందించిన డీఆర్వో, విచారణ జరిపి ఆలయ భూమిని పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక ఆలయ ఆస్తులను కాపాడాలని కమిటీ సభ్యులు కోరారు.

NO COMMENTS

Exit mobile version