మదనపల్లెలోని నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి ఆగి ఉన్న లారీ కింద నిద్రపోయిన అశోక్ కుమార్ (26) అనే యువకుడు, సోమవారం ఉదయం లారీ డ్రైవర్ వాహనాన్ని కదిలించడంతో చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు.
బసినికొండకు చెందిన అశోక్ కుమార్ ఇండేన్ గ్యాస్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
