ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కన్వీనర్ జేసీ రాజు డిమాండ్ చేశారు. బొబ్బిలిలో ఆదివారం సమావేశం నిర్వహించారు.
కూటమి అధికారంలోకి వస్తే ఐఆర్, పీఆర్సీలను అమలు చేసి సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికి అమలు చేయడం లేదన్నారు. ఉగాదిలోగా హామీలను అమలు చేయాలని, లేదంటే పోరాడి సాధించుకుంటామని చెప్పారు.
#BOIENA RAJESH