ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఎస్పీ పేర్కొన్నారు. గాంధీజీ మార్గంలో నడిచి దేశాభివృద్ధికి, రాష్ట్ర సాధనకు ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు.
