చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు,గాంధేయవాది,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు మూలపురుషుడు,హరిజనోద్దరణ కొరకు నిర్వరామంగా కృషిచేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఎన్ ఆర్ పి ఎం గ్రౌండ్ నందు వారి చిత్రపటానికి,విగ్రహానికి పూల దండ వేసి నివాళులు అర్పించి,మునిసిపల్ సెక్యూరిటీ గార్డ్స్ ముగ్గురికి నూతన వస్త్రములు బహుకరించి, 55 మంది పేదలకు కండువాలు పంపిణీ చేసి, అల్పాహారం ఏర్పాటు చేసినారు.
కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురు ప్రసాద్, కూనిశెట్టి శ్రీనివాసరావు, పెరుమాళ్ళ శివ ప్రసాద్,సుధాకరరావు,నారాయణమూర్తి,తుకారాం,రమణారావు,శ్రీనివాసరావు,చెంగలరాయుడు,లాల్,సత్యనారాయణ,తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.
