అమరావతిలోని శాఖమూరులో 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్) మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు, కేవలం 194 రోజుల్లోనే ఈ విగ్రహ ఏర్పాటును పూర్తి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ప్రతీకగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఆయన త్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఈ విగ్రహం తెలుగుజాతి కీర్తిని చాటుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
