సికింద్రాబాద్: వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చికెన్ సెంటర్‌పై పోలీసులు మరియు జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో అనుమతులకు విరుద్ధంగా నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.
పరిశీలనలో భాగంగా అక్కడ కూలిపోయిన మరియు అస్వచ్ఛంగా నిల్వ ఉంచిన చికెన్ నిల్వలు బయటపడ్డాయి.
ఈ సందర్భంగా మెడికల్ అధికారి అగ్నివేష్ మాట్లాడుతూ, ఆ సెంటర్‌కు కేవలం చికెన్ అమ్మకాలకు మాత్రమే అనుమతి ఉందని, నిల్వ ఉంచడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
అదేవిధంగా, ఆ వ్యాపారానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ గడువు కూడా ముగిసినట్లు అధికారులు గుర్తించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరియు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి వ్యాపారాలపై తనిఖీలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
#sidhumaroju
Alwal
