Home South Zone Telangana KCR సంచలన నిర్ణయం: పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!

KCR సంచలన నిర్ణయం: పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!

0

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

వారం రోజుల్లోగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ నియమావళి ప్రకారం వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని లేఖలో హెచ్చరికలు పంపారు.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను సహించబోమని ఈ సందర్భంగా అధిష్టానం స్పష్టమైన సంకేతాలు పంపింది.

NO COMMENTS

Exit mobile version