Home South Zone Telangana భీమన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

భీమన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

0

వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​మంత్రి ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ​

తర్వాత స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ జి. శ్రావణ్ కుమార్ మంత్రికి స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ​ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, ఎమ్మార్వో జయంత్, ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, ఎడ్ల శివసాయి, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి, జూనియర్ అసిస్టెంట్ నరాల రాజు, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version