Home South Zone Telangana నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు

నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు

0

నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. సర్కిల్ లోని ప్రగతినగర్ లో పొందిన అప్రూవల్ అనుమతుల ప్రకారం కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. అలాగే నిజాంపేట్ లోని రెడ్డి ఎవెన్యూ కాలనీలో చట్ట విరుద్ధంగా నిర్మించిన ఓ భవంతి స్లాబ్స్, గోడలను ధ్వంసం చేశారు.

ఈ సందర్బంగా నిజాంపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద మాట్లాడుతూ ప్రతీ బిల్డర్ పొందిన అనుమతులు ప్రకారం మాత్రమే నిర్మాణం చేపట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్దంగా, పొందిన అప్రూవల్ ప్లాన్ కు వ్యతిరేకంగా నిర్మాణం చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version