Home South Zone Andhra Pradesh రైతన్న సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

రైతన్న సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

0

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ కార్యక్రమంలో భాగంగా నేడు బాపట్ల మండలం జమ్మలపాలెం గ్రామంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పర్యటించారు.ఇంటింటికీ వెళ్ళి రైతులతో ముఖాముఖి చర్చించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేస్తుందని గత ప్రభుత్వం కేవలం రూ. 7,500 ఇస్తే, మన ప్రభుత్వం రాష్ట్ర వాటాగా రూ. 14,000 ఇస్తూ రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు.

ఎమ్మెల్యే స్వయంగా రైతు ఇళ్లను సందర్శించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన ఆత్మీయ లేఖను,పథకాల వివరాలతో కూడిన బ్రోచర్లను అందజేశారు. రైతుల ఖాతాల్లోకి జమ అయిన రూ. 6,000 (అన్నదాత సుఖీభవ 3వ విడత) నిధుల గురించి ఆరా తీశారు.

NO COMMENTS

Exit mobile version