Home South Zone Andhra Pradesh ఆక్సిజన్ సిలిండర్‌తో పదో తరగతి పరీక్ష: ప్రాణాలతో పోరాడుతూ విద్యార్థి పట్టుదల.

ఆక్సిజన్ సిలిండర్‌తో పదో తరగతి పరీక్ష: ప్రాణాలతో పోరాడుతూ విద్యార్థి పట్టుదల.

0

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల తొలిరోజు స్ఫూర్తి, విషాదం రెండూ చోటుచేసుకున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన కట్టా కౌశిక్ చంద్ అనే విద్యార్థి తీవ్ర ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నా.

ఆక్సిజన్ సిలిండర్ సాయంతో పరీక్ష రాసి తన పట్టుదలను చాటుకున్నాడు. మరోవైపు కర్నూలు జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న హెడ్ మాస్టర్ అన్వర్ బాషా గుండెపోటుతో పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలి మరణించడం విద్యాశాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. కౌశిక్ పట్టుదలకు నెటిజన్లు ఫిదా అవుతుండగా, అన్వర్ బాషా మృతికి ఉపాధ్యాయ లోకం సంతాపం వ్యక్తం చేస్తోంది.

NO COMMENTS

Exit mobile version