ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత.

0
4

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పద్యకవి, ‘పద్యభారతి’ చదలవాడ లక్ష్మీనరసింహారావు (90) అనారోగ్యంతో ఆదివారం ఒంగోలులో కన్నుమూశారు. మూడున్నర దశాబ్దాల పాటు ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఆయన, పద్య సాహిత్యంపై మక్కువతో ‘పద్య సారస్వత పరిషత్’ స్థాపించి ఎంతోమంది యువ కవులను తీర్చిదిద్దారు.

ఆధ్యాత్మికవేత్తగా శ్రీపశుపతీశ్వర స్వామి దేవస్థాన నిర్మాణానికి భారీ విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరని లోటు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.