చింతూరు: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) జిల్లా అధ్యక్షులు మాసినేని చంద్రశేఖర్ కోరారు. చింతూరు ఐటీడీఏ (ITDA) కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు
.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న ఆలస్యం కారణంగా క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు తమ విధులు నిర్వహించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సంబంధిత కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు మరియు యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
# Yadagiri








