అన్నమయ్య: బెట్టింగ్ మాయలో యువత జాగ్రత్త: ఎస్పీ హెచ్చరిక.

0
5

అన్నమయ్య జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఎస్పీ ధీరజ్ యువతకు ఆదివారం హెచ్చరిక జారీ చేశారు.

సెల్‌ఫోన్‌లో వచ్చే యాప్‌లు, లింకుల ద్వారా బెట్టింగ్‌లో పడి ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇది అప్పులు, కుటుంబ సమస్యలు, నేరాలకు దారితీస్తుందని తెలిపారు. బెట్టింగ్‌లో పాల్గొంటే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు.