అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక.

0
4

మదనపల్లె బీటీ కాలేజ్ హాకీ గ్రౌండ్‌లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక ట్రయల్స్ జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 32 మంది క్రీడాకారిణులు పాల్గొన్న ఈ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచిన 18 మందిని ఎంపిక చేశారు.

వీరు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. హాకీ అసోసియేషన్ కార్యదర్శి శివప్రసాద్ ఈ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ సెక్రటరీ జలజ, ట్రెజరర్ ప్రసాద్ రెడ్డి, డీఎస్డీఓ చంద్రశేఖర్ పర్యవేక్షించారు.