మదనపల్లె మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండకు చెందిన తిరుమల దావీదురాజు (26) పుంగనూరు రోడ్డులో బైకుపై వెళ్తుండగా, తట్టివారిపల్లె బైపాస్ వద్ద ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









