గుడిసెవారిపల్లెలో బైక్ దగ్ధం : ఉద్రిక్తత.

0
4

మదనపల్లె మండలం గుడిసివారి పల్లెలో ఆదివారం రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పర దాడుల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టడంతో బైక్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.