రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు

0
0

రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు

 

Apr 13, 2026,

 

రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్‌లో సత్తా చాటిన విద్యార్థులు

తెలంగాణ : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజకు చెందిన రాము (17) మరియు బెల్లంకొండ విష్ణుచైతన్యగుప్తా (17) మార్చి 17న ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించినప్పటికీ ఆదివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. రాము బైపీసీలో 954 మార్కులు, విష్ణు చైతన్యగుప్తా 960 మార్కులు సాధించారు. హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న వీరు, నీట్, ఎంసెట్ కోచింగ్ కోసం హైదరాబాద్ కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.